
జడ్చర్లటౌన్, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.జడ్చర్లలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థ లు, వ్యాపార, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. బాదేపల్లి గాంధీజీ విగ్రహం దగ్గర, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మార్కెట్‌యార్డులో చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, సింగిల్‌విండో కార్యాలయంలో అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, జడ్చర్ల కోర్టులో జడ్జి శాలినీలింగం, పోలీస్‌స్టేషన్‌లో సీఐ వీరాస్వామి, అబ్కారీ పోలీస్‌స్టేషన్‌లో సీఐ బాలాజీ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య పాల్గొన్నారు. అదేవిధంగా అనురాగిణి అనాథ ఆశ్రమంలో సంస్కారభారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తపాటల పోటీలు నిర్వహించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాధాకృష్ణ, జైపాల్‌రెడ్డి, మంచన విఠలయ్య, లక్ష్మీనారాయణ, బాలవర్దన్, దత్తుకుమార్, రాము పాల్గొన్నారు.
జడ్చర్ల, ఆగస్టు 15 : మండలంలోని గొల్లపల్లి, నసరుల్లాబాద్, ఈర్లపల్లి, కుర్వగడ్డపల్లి, శంకరాయపల్లి, మాచారం, కిష్టారం, కుర్వపల్లి తదితర గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జ రుపుకొన్నారు. కార్యక్రమాల్లో సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, ప్రణీల్‌చందర్, ప్రభాకర్‌రెడ్డి, బాలసుందర్రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్, ఎంపీడీవోస్వరూప తదితరులు పాల్గొన్నారు.
గండీడ్, ఆగస్టు 15 : మండలంలో పంద్రాగ స్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీ వో కార్యాలయంపై ఎంపీపీ మాధవి, రెవెన్యూ కార్యాలయంపై తాసిల్దార్ జ్యోతి, పీఏసీసీఎస్పై చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, గ్రామపంచాయతీ దగ్గర సర్పంచ్ చంద్రకళ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ స భ్యుడు సలీం, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఎంపీ వో శంకర్‌నాయక్, ఏవో కృపాకర్‌రెడ్డి ఉన్నారు.
హన్వాడ, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్స వం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామా ల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సు దర్శన్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షు డు రాజుయాదవ్, సర్పంచ్ రేవతి, ఎంపీటీసీలు కల్పన, సత్యమ్మ, ఎంఈవో రాజునాయక్, ఏవో కిరణ్‌కుమార్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
మహ్మదాబాద్, ఆగస్టు 15 : మండలంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాముడు, వ్య వసాయ కార్యాలయంపై ఏవో ప్రత్యూష, గ్రామపంచాయతీ దగ్గర సర్పంచ్ పార్వతమ్మ, రెవె న్యూ కార్యాలయంపై తాసిల్దార్ రాంబాయి జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అ ధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సలీం, సీ ఆర్పీ వెంకట్, గోవిందరెడ్డి, రాజేశ్వర్, గోపాల్, నర్సింహులు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 15 : మూసాపేట, అడ్డాకుల మండలాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగాజరుపుకొన్నారు. ఆయా గ్రామా ల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కార్యక్రమంలో ఎంపీపీలు నాగార్జునరెడ్డి, గూపని కళావతీకొండయ్య, జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, తాసిల్దార్లు కిషన్, మంజుల, ఎంపీడీవోలు మంజుల, ఉమాదేవి, ఎస్సైలు విజయ్‌కుమార్, నరేశ్, ఏవోలు శ్రీనివాసులు, రాజేందర్రెడ్డితదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, ఆగస్టు 15 : దేవరకద్ర, చి న్నచింతకుంట మండలకేంద్రాలతోపాటు అన్ని గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బాలానగర్, ఆగస్టు 15: మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల దగ్గర ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
రాజాపూర్, ఆగస్టు 15 : మండలంలోని గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, డాక్టర్ ప్రతాప్చౌహాన్, ఏవో న రేందర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు న ర్సింహులు, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి పాల్గొన్నారు.
మిడ్జిల్, ఆగస్టు 15 : మండలంలో పంద్రాగ స్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మం డల పరిషత్ కార్యాలయంపై ఎంపీపీ కాంతమ్మ, రెవెన్యూ కార్యాలయంపై తాసిల్దార్ శ్రీనివాసు లు, గ్రామపంచాయతీ దగ్గర సర్పంచ్ రాధికారెడ్డి, సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై జయప్రసాద్ జా తీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, మిడ్జిల్ పీహెచ్సీ, గ్రంథాలయం, డ్వాక్రా భవనం దగ్గర జెండావిష్కరణలో పొరపాట్లు చోటుచేసుకున్నా యి. జాతీయ జెండాను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు
కోరారు.
కోయిలకొండ, ఆగస్టు 15 : మండలంలోని గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, గ్రామపంచాయతీలో సర్పంచ్ కృష్ణయ్య, రెవెన్యూ కార్యాలయంపై తాసిల్దార్ పాండు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.