అలంపూర్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 15వ తేది శుక్రవారం విజయదశమిని పురష్కరించుకుని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలోని తుంగబద్ర నది తీరంలో సాయంత్రం జోగుళాంబ బాలబ్రహ్వేశ్వరులకు నిర్వహించే తెప్పోత్సవం (హంస వాహన సేవ)అలంపూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
ఈ పర్యాయం తొగుట పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి హాజరు కానున్నారు. స్వామి, అమ్మ వార్ల నదీ విహారం వీక్షీంచేందుకు చుట్టు ప్రక్కల జిల్లాల నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివస్తారు.