విద్యుద్దీకరణతో రైళ్ల రాకపోకలు
మహబూబ్నగర్-గద్వాల మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత్ రైళ్ల రాకపోకలను రైల్వేశాఖ ప్రారంభించింది.
- మహబూబ్నగర్-గద్వాల మధ్య 72.7 కిలోమీటర్లు పనులు పూర్తి
గద్వాల, నవంబర్ 29: మహబూబ్నగర్-గద్వాల మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత్ రైళ్ల రాకపోకలను రైల్వేశాఖ ప్రారంభించింది. 2022 ఏప్రిల్-నవంబర్లో భారతీయ రైల్వేలోని మిగతా జోన్లతో పోలిస్తే దక్షిణమధ్య రైల్వే అత్యధికంగా విద్యుద్దీకరణ రైల్వేలైన్లు పూర్తిచేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే విద్యుద్దీకరణకు పెద్దపీట వేస్తూ మహబూబ్నగర్-గద్వాల మధ్య 72.7కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తిచేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 385కిలోమీటర్లు పనులు పూర్తిచేశారు. డోన్-కర్నూల్సిటీ, మహబూబ్నగర్, సికింద్రాబాద్, ముడ్ఖేడ్, మన్మాడ్ విద్యుద్దీకరణలో భాగంగా మహబూబ్నగర్-గద్వాల స్టేషన్ల మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు 2015-16లో 783కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణకు రూ.900కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య విద్యుద్ధీకరణ ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేసి పనులు పూర్తిచేశారు.
గద్వాల-రాయచూర్ విభాగం మధ్య ఇప్పటికే రైల్వేలైన్లు విద్యుద్దీకరించబడిన సంగతి విదితమే. రైలు మార్గాల విద్యుద్దీకరణ వల్ల రైలు ఇంజన్ మార్చాల్సిన అవసరం లేదు. ఈ మార్గాల్లో ఆటంకం లేకుండా రైళ్లు సజావుగా నడిచేందుకు వీలుంది. విద్యుద్దీకరణ పనులను అమలుచేయడంలో అంకితభావంతో పనిచేసిన ఎలక్ట్రికల్ విభాగం అధికారులను, సిబ్బందిని దక్షిణమధ్య రైల్వే మేనేజర్ అరుణ్కుమార్జైన్ అభినందించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

