అదనపు కలెక్టర్ సీతారామారావు
రెండు మిల్లులకు నోటీసులు
మూసాపేట, మే 28 : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రై స్మిల్లర్లు తీసుకోకుంటే కేసు న మోదు చేయాలని సివిల్ సప్లయ్ డీ ఎం జగదీశ్‌ను అదనపు కలెక్టర్ సీ తారామారావు ఆదేశించారు. మూ సాపేట మండలంలోని అచ్చాయిప ల్లి గ్రామశివారులో ఉన్న వీభా పరిశ్ర మలో ధాన్యం నిల్వ చేసేందుకుగానూ శుక్రవారం అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధా న్యం సేకరణ, తరలింపు తదితర వివరాలను తా సిల్దార్ మంజులను అడిగి తెలుసుకున్నారు. ట్రా న్స్ఫోర్ట్ సమస్య తీవ్రంగా ఉందని, మూడు రో జుల కిందట ఇతర రాష్ర్టాలకు చెందిన వాహనదారులకు రిక్వెస్ట్ చేసి ధాన్యం లోడ్ చేసి పంపితే నే టికీ అన్లోడ్ కాలేదని తెలిపారు. అదేవిధంగా రెండు, మూడు కిలోలు తరుగు పోతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పడంతో అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వా హనాలను అన్లోడ్ చేసి పంపించాలని, ధాన్యం తీ సుకోని రైస్‌మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని సివిల్ సప్లయ్ డీఎం జగదీశ్‌ను ఆదేశించా రు.
ధాన్యం కోటాను ప్రభుత్వం డబుల్ చేసింద ని, ఏ మిల్లు యజమాని అయినా ధాన్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసినా, బేరాలు పెట్టినా, లే దంటే కుంటి సాకులు బెబుతూ కాలయాపన చేసి నా కేసులు నమోదు చేయాలన్నారు. గోదాము ఏర్పాటుకు వీభా పరిశ్రమ అనుకూలంగా ఉంద ని, వెంటనే గోదాము ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, అదనపు కలెక్టర్ ఆదేశం మేరకు రామాంజనేయ, దత్తాత్రేయ రైస్‌మిల్లర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఏవో రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.