అలంపూర్,మే 02: ఉండవల్లి మండల పరిధిలోని ప్రాగటూరు గ్రామంలో గురువారం అర్ధ రాత్రి 18 గడ్డివాములు దగ్దమయ్యాయి. గ్రామానికి చెందిన సుమారు పది మంది రైతులకు సంబంధించిన 18 గడ్డివాములు ఒకేసారి అగ్నికి అహుతాయ్యియి. ప్రమాద విషయాన్నీ తెలుసుకున్న అలంపూర్ ఫైర్ స్టేషన్ ఇన్చార్జి కురుమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక్కో గడ్డివాము సుమారు లక్ష రూపాయల వరకు ఉండవచ్చని సుమారు రూ.20 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీఎం నాయకులు
ప్రాగటూరు గ్రామంలో గడ్డివాముల దగ్ధమైన విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు రేపల్లె దేవదాసు సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులను పరామర్శించారు. బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేసవి కాలంలో పశుగ్రాసం దొరకక రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఇటువంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరమన్నారు. కుట్రపూరితామా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయాన్ని పోలీసులు విచారణ చేపట్టాలన్నారు.