గద్వాల అర్బన్ : అధికలోడు కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రైతులందరూ కొత్త ట్రాన్స్ఫార్మర్ల(Transformers) కోసం డీడీలు చెల్లించాలని.. అప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పేర్కొన్నారు. మంగళవారం కేడిదొడ్డి మండలం పరిధిలోని ఉమిత్యాల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా గురించి రైతులను అరా తీశారు.
కరెంటుపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారు తన దృష్టికి తీసుకువస్తే.. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అక్రమంగా విద్యుత్‌ను ఎవరూ వాడొద్దని ఆయన హెచ్చరించారు. అక్రమంగా కరెంటు కనెక్షన్ తీసుకొని.. ఉపయోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎస్సీ హెచ్చరించారు.
రైతులతో మాట్లాడుతున్న విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి
విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ డీఈ తిరుపతిరావు, ఏడిఏ రమేష్ బాబు, మండల ఏఈ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.