ఎమ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 7 : టీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చే రుతున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రైల్వేస్టేషన్ కాలనీలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు ఆశన్నతో పాటు మరో 20 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెం టనే పరిష్కరిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాందాసుకు సీఎ సహాయనిధి నుంచి రూ.8 లక్ష లు అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ ర మాదేవి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుగుణ, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్, నా యకులు శ్రీకాంత్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, బాలరాజు, ఆంజనేయులు, వెంకట్రాములు ఉన్నారు.