గద్వాల అర్బన్ : ఓ మహిళపై దాడి చేసిన కేసులో ముగ్గురు పై కేసు నమోదు అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని కె టి దొడ్డి మండలం పరిధిలోని నందిన్నే గ్రామంలో రెండు వర్గాల మధ్య ఈనెల 20వ తేదీన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మహిళపై నర్సింలు, మిల్లు ఈరన్న, మిల్లు సురేంద్ర తదితర వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలు కె టి దొడ్డి పోలీస్ స్టేషన్ ఆశ్రయించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించేం దుకు పోలీసులు మొదటగా ప్రయత్నం చేసిన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దాదాపు మూడు వారాలు అవుతున్న నిందితులపైఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండలంలో చర్చనీయాశంగా మారింది. నిందితులు తమను కాపాడుకునేందుకు రాజకీయ నాయకుల ద్వారా పైరవీలు చేస్తున్నట్లు పుకార్లు వినబడుతున్నాయి.
ఈ కేసును నీరు కార్చే విధంగా రాజకీయ పలుకుబడితో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినబడుతున్నాయి. నిందితులు దర్జాగా పోలీసుల కళ్లముందరానే తిరుగుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను రిమాండ్కు తరలిస్తారా లేదా అన్న ప్రశ్నలు ప్రజల ద్వారా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై డి.ఎస్.పి మొగులయ్యను వివరణ కోరగా మహిళపై దాడి కేసు గురించి ఆరా తీసి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.