గట్టు, నవంబర్ 2 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గొర్లఖాన్దొడ్డి గ్రామ శివారులో గంజాయి మొక్కలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో పాలెం ఉరుకుంద తన మిరప పొలంలో గంజాయి మొక్కలు సాగు చేశాడని పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, ఆర్ఐతో కలిసి తనిఖీలు చేయగా..ఆరు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఉరుకుందపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో ఏఎస్ఐ రాంచందర్జీ, తాసిల్దార్ హైమద్ఖాన్, ఆర్ఐ నాగిరెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.