అలంపూర్: సమృద్ధిగా వర్షాలు కురిసి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ఆరుద్రోత్సవం కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగా విరాజిల్లుతున్న అలంపూరు బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్చకులు ఆరుద్రోత్సవం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శృంగేరి పీఠాదిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారి విజయ యాత్ర సందర్భంగా అలంపూరు క్షేత్రాన్ని దర్శించిన సమయంలో ఆలయాభివృద్ధి కోసం ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఆరుద్రోత్సవం నిర్వహించాలని సూచించారు.
పీఠాధిపతి సూచనల మేరకు శివాలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నారు. ముందుగా గోమాతకు పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ గోమాత సహితంగా ప్రదక్షిణలు చేశారు. సకల విఘ్నాలకు అదిపతి అయిన విఘ్నేశ్వరుడికి ఆలయంలో ఆనతి కోరుతూ శాస్రోక్తంగా గణపతి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాన్యాస పారాయణం, పదకొండు పర్యాయాలు నమక చమకాలతో ఏకవార రుద్రాభిషేకాలు నిర్వ హించారు. అనంతరం అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ బాలబ్రహ్మేశ్వర స్వామి మూల విరాట్‌కు అన్న సూక్తంతో అన్నా భిషేకాలు నిర్వహించారు.
శివలింగంను లింగాకృతిలో అన్నంతో అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం దశ విద హారతులు సమర్పించారు. అన్నాభిషేకం నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని అర్చకులు భక్తులకు వివరించారు. ప్రదోష కా ల పూజలో సంద్యా సమయంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వాముల శాంతికల్యాణం మహోత్సవం వైభవంగా నిర్వ హించారు. చివరగా దశ విద హారతులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు.
ఆలయాలను దర్శించుకున్న హైకోర్టు జడ్జి
పట్టణంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలను బుధవారం చెన్నై ఆర్ తరణీ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఉభయ ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్ర మాల అనంతరం శేష వస్ర్తాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వ దించారు.