Gadwal | గద్వాల జోగులాంబ జిల్లాలో ఓ పోలీసధికారి ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్న చందంగా సాగుతోంది. టేబుల్‌పై పైసలు పెట్టు.. ఇసుక ఎంతైనా కోట్టుకో అంటున్నారట సారు. జిల్లాలోని ఓ మండలానికి చెందిన పోలీసధికారి ఇల్లీగల్ ఇసుక దందాకు ఓ రేటు నిర్ణయించారట. ఆ రేటు ప్రకారం మామూలు ముడితేనే దందా చేసుకోవచ్చు. లేదంటే బండి సీజ్ చేసి లోపలేస్తాడు. నెలకు జస్ట్ 60 వేల రూపాయలు సమర్పిస్తే చాలు… నీ చేతనైనంత ఇసుక తరలించుకోవచ్చు. బేరం కుదిరితే ఒకలా.. బేరం కుదరకుంటే మరో లా ఉంటుంది ఆ సారు స్టైలు. పై అధికారితో అన్నీ మాట్లాడుకుంటే మండలంలో మేమెందుకు.. బజన చేసుకోవడానికా? అంటున్నారట. డబ్బులిచ్చి దందా చేసుకో అంటూ అనధికారిక ఆదేశాలు జారీ చేశారట.
ఈ అధికారి అక్రమ ఇసుక దందాపై మండలంలోనే కాదు జిల్లా మొత్తం చర్చనీయాంశంగా మారింది. పగలు స్టేషన్లో డ్యూటీ.. రాత్రి మరో అడ్డాలో దందా నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాత్రి పది తర్వాత ప్రైవేట్ బైక్ పై ఒంటరిగా చక్కర్లు కొడుతూ ఇల్లీగల్ దందాలపై నజర్ వేస్తాడు. దొరికినోళ్లను లోపలేస్తాడు. కానీ.. నెలనెల మాముళ్లు ఇచ్చే బండ్లను మాత్రం టచ్ చేయడు. మామూళ్లు రాని బండ్లను పట్టుకుని సీజ్ చేసి సెటిల్మెంట్కు రమ్మంటాడు.
మండల కేంద్రంలో ఓ అడ్డా ఏర్పాటు ఏర్పాటు చేసుకొని దందా నడపిస్తున్నారు. రాత్రి అయిందంటే చాలు సార్ దర్శనం కోసం ఇసుక వ్యాపారులు, సెటిల్మెంట్ కోసం వచ్చే మధ్యవర్తులు అడ్డా దగ్గర క్యూ కడతారు. మొదట ఆ అధికారి ఫలానా తాలూకా అని అందరూ భావించారు. కనీ సారు పక్కా కమర్షియల్ అని తరువాత అర్థమయిందట. ఎలాంటి రాజకీయ పైరవీలు లేకుండా నేరుగా ఆ సారును కలిస్తే చాలు డీల్ సెట్ చేసుకోవచ్చట. ఈ సారు దందాపై మండలంలోని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాట్సప్ లోకల్ గ్రూపులల్లో కూడా ఈయన దంద గురించి చర్చించుకుంటున్నారు.