5K Run | గద్వాల జిల్లాలో ఉత్సాహంగా 5కె రన్.. భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు
గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ధి పథకంలో నడిపిన మహానేత కేసీఆర్ అని గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ధి పథకంలో నడిపిన మహానేత కేసీఆర్ అని గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దశాబ్ది కార్యక్రమాల్లో భాగంగా 5కె రన్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్, కృష్ణవేణి చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వైయస్సార్ చౌక్ వరకు యువతతో కలిసి 5 కె రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హనుమతునాయుడు మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంతటి ఉత్సాహభరితమైన వాతావరణంలో మీ అందరి మధ్య ఈ 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గద్వాల జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ధి పథకంలో నడిపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాకు నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేసి జిల్లాను మరింత అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
ఈ 5 కే రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యం పట్ల మనకు ఉన్న బాధ్యతకు, అవగాహనకు ఒక ప్రతీక అని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగర్ దొడ్డి వెంకట్రాములు, జి.రాఘవేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, సంటెన్న, టీఎన్ఆర్ జగదీష్, దుబన్న, గువ్వల గోపాల్, నరసింహులు, మోహన్ యాదవ్, చిత్తరి కిరణ్, కమ్మరి రాము, రామకృష్ణ, కోటేష్, కురవ పల్లయ్య, బీచుపల్లి, వెంకటేష్ నాయుడు, జాంపల్లి భరత్ సింహారెడ్డి, వినయ్, శేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- 5k run
- BRS
- Gadwal district
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

