
వనపర్తి జిల్లాలో పెరిగిన రోడ్ల కనెక్టివిటీ
రోడ్ల రాకతో అభివృద్ధి బాటలో గ్రామాలు
పనులు నాణ్యతగా, త్వరగా చేపట్టాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
గోపాల్పేట, డిసెంబర్ 29 : జిల్లాలో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జిలతో ప్రయాణం మరింత సాఫీగా సాగనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో చింతబావి వద్ద ప్రధాన రహదారి మీద వాగుపై సంస్థానాధీశులు నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరగా.. కొత్త వంతె న నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో రోడ్ల కనెక్టివిటీ పెరిగిందన్నారు. రహదారుల అనుసంధానంతో సంబంధిత గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యతగా.. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చింతబావి వద్ద వాగుపై ఉ న్న బ్రిడ్జి భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి దెబ్బతిన్నదని తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణానికిగానూ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు చెప్పారు. ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయని, అందుకే 12 ఫీట్ల వెడల్పు ఉన్న బ్రిడ్జిని 36 ఫీట్ల వెడల్పు చేయనున్నట్లు వివరించారు. అదే విధంగా బ్రిడ్జి పక్క నుంచి చెన్నూరు వరకు బైపా స్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో చె న్నూరు వాసులు గోపాల్‌పేటకు రావడానికి మరింత సౌకర్యవంతంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, టీఆర్ఎస్ వనపర్తి పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింగం, ఈఈ దేష్యా, డీఈ దానయ్య, ఏఈ రాకేష్, జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హ ర్యానాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోదండం, విండో చైర్మన్ రఘుయాదవ్, వైస్ చైర్మన్ రాములు, రై తుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర య్య యాదవ్, తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో కరుణశ్రీ, టీఆర్ఎస్ నాయకులు మన్యం నాయక్, రాజేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనులకు భూమి పూజ..
పెబ్బేరు రూరల్, డిసెంబర్ 29 : మండలంలోని గు మ్మడం రోడ్డు పనులకు మంత్రి నిరంజన్‌రెడ్డి భూమి పూజ చేశారు. గుమ్మడం క్రాస్‌రోడ్డు నుంచి కృష్ణానది వరకు రోడ్డు కోసం ఆర్అండ్బీ రూ.95 లక్షలు మం జూరు చేయగా.. ఈ పనులను మంత్రి ప్రారంభించా రు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో నరసింహు లు, పెబ్బేరు ఎంపీపీ శైలజ, జెడ్పీటీసీ పద్మ, అధికారు లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
వీపనగండ్ల, డిసెంబర్ 29 : రైతు సంక్షేమమే ధ్యే యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కల్వరాల గ్రా మంలోని ఓ రైతు వ్యవసాయ పొలంలో నిర్వహించిన శుభకార్యానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ప్రధానంగా రైతుబంధు, వానకాలం పంట వివరాలు, యాసంగి సాగుపై మాట్లాడారు. పంటమార్పిడి పద్ధతులను అవలంబించాలని సూచించారు. వరి వేయొద్దని, ఇతర పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రఘునాథ్రె డ్డి, విండో మాజీ వైస్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎండీ సర్దార్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధే ధ్యేయం..
శ్రీరంగాపూర్, డిసెంబర్ 29 : గ్రామాల అభివృ ద్ధే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిరంజన్‌రెడ్డి అ న్నారు. మండలంలోని శేరుపల్లి వాగు, వెంకటపూర్-జానంపేట గ్రామాల మధ్య అలుగుపై వంతెన ని ర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 70 ఏండ్ల పాలనలో చేయలేని పనులను సీఎం కేసీఆర్ ఏడేండ్లలో చేశారని తెలిపారు. రాష్ట్రంలో వలసలు తగ్గి గ్రా మాల్లో వ్యవసాయ పనులు పెరిగాయన్నారు. శ్రీరంగాపూర్ మండలంలో రెండు హై లెవల్ వంతెనలను ప్రారంభించినట్లు తెలిపారు. శేరుపల్లి వాగు వంతెన కు రూ.2 కోట్లు, వెంకటాపూర్-జానంపేట మధ్య అలుగుపై వంతెనకు రూ.3 కోట్లు మంజూరు చేసిన ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, విం డో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు, రైతుబం ధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటస్వామి తదితరులున్నారు.