
మున్సిపల్ కార్యాలయ నూతన భవనానికి రూ.3కోట్లు మంజూరు
రూ.23కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
పందుల నివారణకు కమిటీ ఏర్పాటు
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, డిసెంబర్ 29 : సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, కౌన్సిల్ సభ్యులందరూ ఐక్యంగా ఉండి ము న్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను కౌన్సిల్ సభ్యు లు సభ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలోని కాలనీల్లో ఉన్న 10శాతం ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయ ని, ప్రభుత్వ స్థలాలను రక్షించాలని కోరారు. మున్సిపల్ వా హనాల సర్వీసింగ్ ఖర్చును అధికంగా చూపుతున్నారని, ఇందిరానగర్‌కాలనీలో పనులు చేపట్టకపోయినా చేసినట్లు చూపారని పలువురు ఆరోపించారు. పట్టణశివారులోని ఎర్రగుట్ట దగ్గర పేదలకు ఇచ్చిన ప్లాట్లను కొందరు కబ్జా చేస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇంటి స్థలాలను అప్నగించాలని సభ్యులు కోరారు. అలాగే పట్టణప్రగతిలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్లను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కౌన్సిలర్లు, అధికారులకు సూచించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూ డాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నా రు. పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జడ్చర్ల మున్సిపల్ కార్యాలయ నూత న భవన నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీలో కొత్తగా రూ.23కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించా రు. కాగా, పట్టణంలో పందుల నివారణకు అన్ని పార్టీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని, పట్టణం నుంచి పందులను పూర్తిగా తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో వైస్‌చైర్‌పర్సన్ సారిక, కమిషనర్ సునీత, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రఘురాంగౌడ్, ఉమాదేవి, జ్యోతీకృష్ణారెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, రమేశ్, సతీశ్, లత, చైతన్య, రాజు, నవనీత తదితరులు ఉన్నారు.