
సీఎం కేసీఆర్‌కు రైతుల కృతజ్ఞతలు
కోస్గి, డిసెంబర్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని శివాజీ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం రైతు పక్షపాతి అని, దేశంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, నాయకులు రాజేశ్, వరప్రసాద్, మాస్టర్ శ్రీనివాస్, వెంకట్‌నర్సింహులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్, డిసెంబర్ 29: రైతులను ఉన్నతస్థాయికి తీసుకుపోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతుబంధుతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని రైతు బంధు సమితి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ కావడంతో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు టీఆర్ఎస్ నేతలు క్షీరాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకొద్దామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, కౌన్సిలర్లు పటేల్ ప్రవీణ్, లక్ష్మణ్, అనంతరెడ్డి, నాయకులు ఆర్. శివరాజ్, వినోద్ పాల్గొన్నారు.
వేములలో..
మూసాపేట, డిసెంబర్ 29: మండలంలోని వేముల గ్రామంలో రైతుబంధు సాయం అందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో సాగునీరు లేక వ్యవసాయం నిర్వీర్యం అయ్యిందన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా పొలాలు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, నాయకులు రఘుపతిరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.