
వనపర్తి రూరల్, డిసెంబర్ 29 : ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరికి బదులుగా ఇతర పంటలైన ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని డిప్యూటీ కమిషనర్, వ్యవసాయ, రైతు సంక్షే మ శాఖాధికారి డాక్టర్ దిలీప్‌కుమార్ శ్రీవాస్తవ సూచించారు. అ ప్పుడే అధిక లాభాలు పొందవచ్చన్నారు. బుధవారం మండలంలోని కడుకుంట్ల పంచాయతీలో ని ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడుకుంట్ల ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచుతున్న లక్షా 80 వేల ఆయిల్‌పామ్ మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకుగానూ జూలై నాటికి దరఖాస్తు చేసుకున్న రైతులు వారి పొలాల్లో నాటుకోవాలని కోరారు. అ లాగే మరో లక్షా 80 వేల విత్తనాలు ప్రభుత్వం నుం చి సరఫరా అయ్యాయని పేర్కొన్నారు. ఆగస్టులో పూర్తి స్థాయిలో విత్తనాలు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయిల్‌పామ్ లాభదాయకమైన పంటగా పేర్కొన్నారు. ఎకరాకూ 57 మొక్కలను త్రికోణాకారంలో 9 మీటర్ల దూరంలో సాగు చేయాలని సూచించారు. ఒక మొక్కకు రూ.117 ఖర్చు అవుతుందని, అందుకు ప్రభుత్వం రూ.84 రాయితీతో అందిస్తున్నదని తెలిపారు. రైతులు కేవలం రూ. 33 మాత్రమే చెల్లించాలన్నారు. నాటిన ఐదేండ్ల నుంచి లాభాలు రావడం మొదలవుతాయని చెప్పా రు. అంతవరకు అంతర పంటలైన వేరుశనగ, పెసర్లు, ఉలవలు, ఆలసందలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చని వివరించారు. అంతర పంటల విత్తనాల కోసం సర్కార్ రూ.2 వేలు, భూమి దున్నేందు కు మరో రూ.2 వేలు నాలుగేండ్లు అందిస్తుందన్నారు. దీంతో రెండు రకాల ఆదాయం రైతులు పొం దవచ్చని సూచించారు. జిల్లాలో వివిధ మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ తోటలను 250 ఎకరాల్లో సాగు చేసినట్లు తెలిపారు. 6 వేల ఎకరాల్లో తోటల సాగుకు దరఖాస్తులు అందాయని, జూన్, జూలైలో మొక్కలు నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎకరాకూ 10 టన్నుల గెలలు దిగుబడి వస్తుందని, ఏజెన్సీల ద్వారా మార్కెటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సా గుకు ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి సురేష్, ప్రయునిఖ్ కం పెనీ ప్రతినిధులు రామ్మోహన్రావు, సత్యనారాయణ, నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.