
టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి : ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
సీసీరోడ్లు, వీధి వ్యాపారుల సముదాయాలు ప్రారంభం
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబర్ 27 : పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 23వ వార్డులో రూ.95 లక్షలతో వేసిన సీసీరోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాఘవేంద్ర, ఈశ్వర్కాలనీల్లో సీసీరోడ్లను పరిశీలించారు. పలు కాలనీల్లో పర్యటించారు. శ్రీపురం చౌరస్తాలో రూ.50 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయాన్ని ప్రారంభించారు. 24వ వార్డులో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు కాలనీవాసులు, మహిళలు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు, కమిషనర్ అన్వేష్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.