మన ఊరు-మన బడితో మెరుగవ్వనున్న ప్రమాణాలు
వనపర్తి జిల్లాలో మొదటి విడుతలో 183 స్కూళ్లు ఎంపిక
వనపర్తి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో వనరులు, వసతులు, నూతన భవనాలు, తరగతి గ దులు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మూడేండ్లకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289.54 కోట్లు వెచ్చించనున్నది. మొదటి విడుతలో ఎక్కువ అడ్మిషన్లు ఉ న్న 35% పాఠశాలలను ఎంపిక చేసి రూ.3,497.62 కోట్లను ఖ ర్చు చేయనున్నది. కలెక్టర్ల పర్యవేక్షణలో మౌలిక వసతులు కల్పించనున్నారు. పాఠశాలల్లో నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ, వంటగది, శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాల నిర్మాణాలు, డిజిటల్ బోధన వంటి 12 రకాల సౌకర్యాలు సమకూర్చనున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంత ఎస్టిమేషన్కు ఏ స్థాయి ఇంజినీరింగ్ అధికారి సాంకేతిక అనుమతి మం జూరు చేయొచ్చని నిర్ధేశించారు. రూ.30 లక్షల వరకు డిప్యూటీ ఇంజినీర్, రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎగ్జిక్యూటి వ్ ఇంజినీర్, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లకుపైబడి చీఫ్ ఇంజినీర్లు అనుమతులిస్తారు. ఇంజినీరింగ్ అధికారులు పాఠశాలను సందర్శించి విద్యా కమిటీ చైర్మన్, హెచ్ఎంలతో చర్చించి వసతుల కల్పనకు అంచనా వ్యయాన్ని నిర్ధేశిస్తారు. స్థాయికి అనుగుణంగా ఒక్కో పాఠశాలకు రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ, హెచ్ఎం, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, ఫీల్డ్ ఇంజినీర్ కార్యక్రమ నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించనున్నారు. దాతలు రూ.2లక్షలు విరాళం ఇస్తే కమిటీలో సభ్యుడిగా ఉంటారు. రూ.10 లక్షలపైన ఇస్తే పాఠశాలలో ఒక గదికి దాతలు సూచించిన వారి పేరు పెట్టనున్నారు. వనపర్తి జిల్లాలో మొదటి విడుతకుగానూ 183 పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో మూడు మండలాల్లో 38 పాఠశాలలు, దేవరకద్రలోని రెండు మండలాలకు రూరల్‌లో 19, అర్బన్‌లో 6, మక్తల్‌లోని రెండు మండలాలకు రూరల్‌లో 14, అర్బన్‌లో 6, వనపర్తిలోని ఏడు మండలాలకు రూరల్‌లో 83, అర్బన్ ప్రాంతాల్లో 17 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉ న్నత పాఠశాలలను ఎంపిక చేశారు.
జాగ్రత్తగా తీసుకొస్తాం..-విద్యార్థినికి మంత్రి కేటీఆర్ హామీ
మాగనూర్, ఫిబ్రవరి 25 : మండలంలోని నేరేడగం గ్రామానికి చెంది న శివరాం, ప్రియాంక కూతురు కె.అక్షిత ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ మొద టి సంవత్సరం చదువుతున్నది. తమ కూతురిని ఇండియాకు క్షేమంగా తీసుకురావాలని విద్యార్థిని తల్లిదండ్రులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే వెంటనే మంత్రి కేటీఆర్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. మంత్రి అక్షితతో ఫోన్లో మాట్లాడారు. ‘ఎవరూ భయాందోళనకు గురి కావొద్దు.. అక్కడ ఉన్న వారిని తప్పకుండా ఇండియాకు తీసుకొస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు.