సరస్వతీ నమస్తుభ్యం
ఘనంగా వసంతపంచమి
సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు
చిన్నారులకు అక్షరాభ్యాసం
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 5 : వసంతపంచమి వే డుకలను జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులతో సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు. జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేఎస్.రవికుమార్, ప్రిన్సిపాల్స్ సుజీవన్, చంద్రశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
సావిత్రీబాయి ఫూలే చిత్రపటం బహూకరణ
వసంతపంచమిని పురస్కరించుకొని ట్రస్మా ఆధ్వర్యంలో డీఈవో ఉషారాణికి సావిత్రీబాయి ఫూలే చిత్రపటాన్ని బ హూకరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, మాధవి, రవికుమార్, విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 5 : వసంతపంచమిని పురస్కరించుకొని బాదేపల్లి సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సరస్వతీమాత యజ్ఞం నిర్వహించారు. అనంతరం చి న్నారులతో అక్షరాభ్యాసం చే యించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షురాలు పద్మలీలా, వి శ్రాంత ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, హెచ్ఎం వెంకట య్య, నోముల కృష్ణయ్య, సుబ్బారావు పాల్గొన్నారు.
నోట్ పుస్తకాలు పంపిణీ
వాసవీక్లబ్, వనితాక్లబ్ ఆధ్వర్యంలో జడ్చర్లలోని శిశుమందిరం పాఠశాల విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పలకలతోపాటు ఆటవస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవీక్లబ్ అధ్యక్షుడు కండె కృష్ణ, వనితాక్లబ్ కార్యదర్శి మాధవి, ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్, సరిత, శిశుమందిరం అధ్యక్షురాలు పద్మలీల పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఫిబ్రవరి 5 : మండలంలోని నందిగామ ప్రభుత్వ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధవి పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 5 : మండలకేంద్రంతోపాటు, రాచాల తదితర గ్రామాల్లో సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు సరస్వతీమాత కటాక్షం తో చదువులో రాణించి ఉన్న త శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
మూసాపేట మండలంలో..
మండలకేంద్రంతోపాటు, నిజాలాపూర్, జానంపేట తదితర గ్రా మాల్లో సరస్వతీమాతకు ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూసాపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం వందరోజుల రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

