మార్చి 14 నుంచి 17 వరకు అవకాశం
ఆసక్తిదారులకు ప్రత్యక్ష బహిరంగ వేలం
మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 18 : ఎటువంటి చిక్కులు లేని, పట్టణానికి అతి దగ్గరలోని రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లా ట్లను సొంతం చేసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. పట్టణంలోని జిల్లా ప రిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లపై నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. సమావేశానికి ప్రజలు, ఆసక్తిదారుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్-భూత్పూ ర్ రహదారి మధ్యలో ఉన్న రాజీవ్ స్వగృహ సారిక టౌన్‌షిప్‌లోని ప్లాట్లను నిర్భయంగా కొనుగోలు చేయవచ్చని తె లిపారు. మధ్య తరగతి వ ర్గాలకు మంచిగా ఇవ్వాల న్న ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా సారిక టౌ న్షిప్లో అన్ని అనుమతులతో ఎలాంటి చిక్కులేని ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్చి 14 నుంచి 17వ తేదీ వర కు మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యక్ష బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మధ్య తరగతికి ఇదే మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలు, సమాచారం కోసం కలెక్టరేట్ కార్యాలయంతోపాటు రాజీవ్ స్వగృహ సారిక టౌన్షిప్ ఫెసిలిటే షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్ తెలిపారు. రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి వేలం నింబంధనలు, ప్ల్లాట్ల వివరాలు, ధరావత్ తదితర వివరాలు తెలిపారు. సమావేశంలో హెచ్ఎండీఏసీసీవో గంగాధర్, ఈఈ పద్మ తదితరులు పాల్గొన్నారు.