5 రకాల టిఫిన్లతో నిండనున్న ఖాళీ కడుపులు
రాష్ట్రంలోనే తొలిసారిగా పాలమూరు జిల్లాలో అమలు
హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
అరబిందో ఫార్మా సహకారంతో 5 వేల మందికి..
నేడు ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యార్థులకు రుచికరమైన అల్పాహారం అందనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఖాళీ కడుపుతో ఉండొద్దనే ఉద్దేశంతో ఉదయం పూట 5 రకాల టిఫిన్లు (ఇడ్లి, వడ, దోస, పూరి, కిచిడీ) ప్రతిరోజూ అందించనున్నారు. నిర్వహణ కోసం హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రాగా.. అరబిందో ఫార్మా సహకారం అందించనున్నది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు వద్ద స్వాస్త్య ఆహార పేరిట సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మించారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించి శారీరక ఎదుగుదలకు సహకరించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో తొలిసారిగా పాలమూరు జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమాన్ని శనివారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు. ముందుగా 5 వేల మంది కడుపు నింపనుండగా.. తర్వాత 15 వేల మందికి అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ప్రారంభం కానున్నది. బడులకు ఉదయం పూట విద్యార్థులు వచ్చే సమయంలో వారి తల్లిదండ్రులు వ్యవసాయ, కూలీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో అనేక మం ది చిన్నారులు కనీసం అల్పాహారం కూడా లేకుండా బ డికి వస్తున్నారు. వారంతా మధ్యాహ్న భోజనం వరకు ఖాళీ కడుపుతో పస్తులు ఉంటున్నారు. ఈ విషయం గ్రా మాల పర్యటనలో భాగంగా పాఠశాలల సందర్శనకు వె ళ్లిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి వచ్చింది. విద్యార్థులు ఖాళీ కడుపుతో రావడం, మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూసే పరిస్థితికి ఆయన చలించిపోయారు. చా లా మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బక్కపలచగా ఉన్న విషయాన్ని ఆయన గమనించారు.
తల్లిదండ్రులు ఉదయమే పనులకు వెళ్లడం వల్ల తమకు అ ల్పాహారం అందటం లేదని పలువురు విద్యార్థులు మం త్రికి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఆ యన నాటి కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో చర్చించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతి రోజూ ఉద యం అల్పాహారం అందించేందుకు ఏదైనా కార్యాచర ణ చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్‌తో మాట్లాడారు. ఇందుకు అవసరమైన స్థ లం, భవన నిర్మాణం, కిచెన్ ఎక్విప్మెంట్ అందించేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకు వచ్చిం ది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు గ్రా మం వద్ద రాయిచూర్ హైవే పక్కనే కొందరు దాతలు, అరబిందో ఫార్మా ఫౌండేషన్ వైస్ చైర్మన్ నిత్యానందారెడ్డి సహకారంతో హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ స్వాస్త్య ఆహార పేరిట సెంట్రలైజ్డ్ కిచెన్‌ను నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించనున్నారు.
ఐదు రకాల టిఫిన్లు..
హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అల్పాహార కార్యక్రమం జిల్లాలో మొదట మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. అక్కడ చదివే విద్యార్థులకు ఉ దయం పూట 5 రకాల టిఫిన్లను (ఇడ్లి, వడ, దోస, పూ రి, కిచిడి) ప్రతిరోజూ అందించనున్నారు. దీనివల్ల వి ద్యార్థుల హాజరు శాతం పెరగడంతో, వారికి పౌష్టికాహా రం అందించి వారి శారీరక ఎదుగుదలకు సహకరించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. తొలుత సు మారు 5 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అం దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రమంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని సుమారు 15 వేల మంది కి అందించేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు రవి లోచన్ దాస, సహచరులు ఆహ్వానించారు.
విద్యార్థులు ఆకలితో ఉండొద్దనే..
మహబూబ్‌నగర్ జిల్లాలో పలు పాఠశాలలను సందర్శించాను. కొన్నిచోట్ల విద్యార్థులతో మాట్లాడాను. వారి తల్లిదండ్రులు వ్యవసాయం, కూలి, ఇతర పనుల నిమిత్తం ఉదయమే ఇంటి నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో అల్పాహారం చేసే పరిస్థితి లేక ఖాళీ కడుపుతో వస్తున్నామని విద్యార్థులు చెప్పారు. పలువురు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించాం. వారికి ఎలాగైనా అల్పాహారం అందించాలనే ఆలోచన రావడంతో అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్తో చర్చించాం. ఆయన కూడా స్పందించారు. అప్పటికే వివిధ బడులకు మధ్యాహ్నం, రూ.5 భోజనం అందిస్తున్న హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్‌కు విషయాన్ని చెప్పాం. వారికి అవసరమైన స్థలం, కిచెన్ షెడ్ ని ర్మాణం, వంట సామగ్రి సిద్ధం చేసేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ కూడా ముందుకు వ చ్చింది. శనివారం కిచెన్‌ను ప్రారంభిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చదివే ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకుండా చూ స్తాం. దాతలు ముందుకు రావాలి. హరే రామ, హరే కృష్ణ అక్షయ పాత్ర కిచెన్ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్కు కృతజ్ఞతలు.
– వి.శ్రీనివాస్ గౌడ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి