మల్దకల్, ఫిబ్రవరి 11: మండలంలోని అన్నిగ్రామాలకు చెందిన పేద, నిరుపేదలైన దళితులు దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకానికి పెట్టుకున్న దరఖాస్తులను గ్రామాలవారీగా పరిశీలించాలని ఆదేశించారు. దీనికిగానూ తాసిల్దార్ సరితారాణి, ఎంపీడీవో కృష్ణయ్య, ఏవో రాజశేఖర్, మండల వైద్యాధికారి వినయ్ కుమార్‌ను కలెక్టర్ ప్రత్యేక కమిటీగా నియమించింది. ఈ కమిటీ బృందం మండలంలోని ఎల్కూర్, పాల్వాయి, నాగర్ దొడ్డి, విఠలాపురం, కుర్తిరావుల చెర్వు, మల్దకల్లో శుక్రవారం పర్యటించింది. దళితబంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నవారి ఇండ్లకు వెళ్లి దరఖాస్తుదారుడి ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, విద్యార్హత, ఇల్లు, భూమి, ఫ్యామిలీ, యూనిట్ వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీ బృందం పర్యటించి పూర్తి వివరాలను సేకరిస్తున్నామన్నారు. మండలంలో మొత్తం 13 దరఖాస్తులు ఉన్నాయమని వీటిలో 8మంది దరఖాస్తుల విచారణ పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ, ఆయా గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఉండవెల్లి మండలంలో..
ఉండవెల్లి ఫిబ్రవరి 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి అర్హులైనవారిని మండలస్థాయి అధికారుల బృందం శుక్రవారం సర్వే నిర్వహించారు. మండలంలోని పుల్లూరు పద్మ, శిరీష కలుగోట్ల, సువర్ణ మెన్నిపాడు, మద్దిలేటి బొంకూరు, నర్సింహ తక్కశిల, ప్రసాద్ మారుమునగాల, సూర్యబాబు కంచుపాడు, శేఖర్ చిన్నఆముదాలపాడు, ఏ బుడిదపాడు రమేశ్‌ను ఎంపిక చేసిన్నట్లు ఎంపీడీవో నాగశేషాద్రిసూరి పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ శివకుమార్, ఆర్ఐ సుచిత్ర, వీఆర్వోలు పాల్గొన్నారు.