కొత్తకోట, ఫిబ్రవరి 12: దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయా గ్రామాలకు చెందిన 133మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు, 18 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. తెలంగాణ గుజరాత్ కంటే అన్ని విధాలా బాగుందన్న కసితోనే రాజ్యసభలో పీఎం మోదీ మన రాష్ట్రంపై విషం కక్కారన్నారు. కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూనే నాలుగు ఓట్లు దన్నుకోవడానికి కేంద్రప్రభుత్వం చూస్తున్నదన్నారు. పంజాబ్‌లో పండించిన ధాన్యాన్ని కొని ఇక్కడి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 8వేల మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా పదిలక్షల మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం మిరాసిపల్లిలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం వెజ్, నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నాయకులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాక బాలనారాయణ, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ జయమ్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిన్నె కొండారెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, వైస్‌ఎంపీపీ శ్రీనివాసులు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, నాయకులు భీంరెడ్డి, కొండారెడ్డి, బాబురెడ్డి, నిర్మలారెడ్డి, సయ్యద్‌లాల్, అల్లాబాషా, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.