ఎంపీ రాములు
ఉండవెల్లి, రాజోళి మండలాల్లో బీటీ, సీసీ రోడ్లకు భూమిపూజ
హాజరైన ఎమ్మెల్యే అబ్రహం
ఉండవెల్లి, ఫిబ్రవరి 20: కరోనా కష్ట కాలంలోకూడా అలంపూర్ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఎంపీ రాములు పేర్కొన్నారు. మండలంలోని పుల్లూరు గ్రామం నుంచి కలుగోట్ల గ్రామం వరకు బీటీరోడ్డు పనులను నాగర్‌కర్నూలు ఎంపీ రాములు, ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రవాణా వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి జరుగుతుందనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, తండాకు బీటీ రోడ్డు వేయిస్తున్నారన్నారు. పుల్లూరు గ్రామం నుంచి కలుగోట్ల గ్రామం వరకు 6.5 కిలోమిటర్లు బీటీరోడ్డుకు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రూ. 3కోట్ల 27లక్షలు మంజురు చేయించామని ఎంపీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ మార్చి తర్వాత కొత్త పింఛన్, డబుల్ బెడ్రూం కోసం ఇంటి స్థలం ఉన్న వారి కి డబ్బులు మంజూరు, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇటిక్యాల మండలం ఎరవల్లి క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా అండర్ పాస్ బ్రిడ్జి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు రవాణా వ్యవస్థ సులభతరం చేసేందుకు సోమశిల వద్ద రూ.1200కోట్లతో ఐకాన్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు ఎంపీ వివరించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ అవుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను అర్హలైన వారికి అందిస్తు న్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీసమ్మ, జెడ్పీటీసీ రాములమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరాపురం రమణ, టీఆర్ఎస్ నాయకులు కలుగోట్ల తేజ, బొంకూరు శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.
అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
రాజోళి, ఫిబ్రవరి 20: గ్రామాలకు వెళ్లేందుకు బీటీ రోడ్లు, పల్లెల్లో సీసీ రోడ్లువేసి వాటిని అభివృద్ధ్ది చేసేదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం విశ్రమించదని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యు లు రాములు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో వారు పలు అభివృ ద్ధి పనులకు భూమి పూజ చేశారు. పెద్ద ధన్వాడ నుంచి చిన్న ధన్వాడ వరకుగల బీటీ రోడ్డుకు రూ.80 లక్షలతో రెన్యూవల్ వర్క్ చేపట్టగా భూమి పూజ చేశారు. అనంతరం చిన్న ధన్వాడలో రూ.6లక్షలతో నసనూర్లో రూ.9లక్షలతో సీసీ రోడ్లు వేసేందుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ మరియమ్మ, జెడ్పీటీసీ సుగుణమ్మ, శ్రీనువాసు లు, నథానియేల్, లోకేశ్వర్‌రెడ్డి, మూగెన్న పాల్గొన్నారు.