ధరూరు, ఏప్రిల్ 5 : సీఎం కేసీఆర్ హయాంలో గణనీయమైన ప్రగతి సాధించామని బీఆర్ఎస్ జిల్లా ఇన్చా ర్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. పేద ల గుండె చప్పుడు, ధైర్యంలో నుంచి బీఆర్ఎస్ ఉద్భవించిందన్నారు. మం డలకేంద్రంలోని భీం రెడ్డి రైస్‌మిల్లు ఆవరణ లో బీఆర్ఎస్ పార్టీ నా యకులతో బుధవా రం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా రు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, సాధికారత యుగం నడుస్తుందన్నారు. విద్య, వైద్యం, సాగు, తాగు నీరు, విద్యుత్, పారిశ్రామికం, పారిశుధ్యం, ఉద్యోగం వంటి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నామన్నారు. గడపగడపకూ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్, నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రామాల్లో నే వైద్యం అందించేందుకు ప ల్లె దవాఖానలను ఏ ర్పాటు చేశామన్నారు. రైతుబంధు, రై తుబీమా, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పం పిణీ, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతలు సంబురంగా సాగు చేస్తున్నట్లు వివరించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే విద్యుత్, సాగునీటికి తి ప్పలు తప్పవని నాటి పాలకులు వెక్కిరించారని.., కానీ నే డు ఎక్కడైనా ఆ కష్టాలు ఉన్నాయా అని ప్రజలను అడిగారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి తీసుకురావడం తో పంటలు కళకళలాడుతున్నాయన్నారు. లేనిపోని అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్న ప్రతిపక్షాలను పట్టించుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ హ యాంలో జరిగిన అభివృద్ధిని కండ్లారా చూస్తున్నామన్నారు.
అందుకే సమ్మేళనానికి స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కు మనంమందరం రుణపడి ఉండాలన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలతో నడిగడ్డ సస్యశామలంగా మారిందన్నారు. గ త నాయకులు నడిగడ్డను నట్టేట ముంచి.. నేడు అధికారం కోసం కులాలు, మతాల పేరిట చిచ్చులు పెడుతూ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో పెట్టుబడి కోసం అష్టకష్టాలు పడేవారని.., రైతుబంధుతో ఆ వెతలన్నీ తీరాయన్నారు. పంట నష్టం రాయించుకోవాలంటే ఆదర్శ రైతుకు, వీఆర్వోకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఉండేది. నేడు అధికారులే వచ్చి నష్టం వివరాలు నమోదు చేసుకుంటున్నారన్నారు. రైతు చనిపోతే దశదినకర్మ పూర్తయ్యేలోగా రూ.5 లక్షల బీమా డబ్బులు అందుతున్నాయన్నారు. గొల్లకురుమలు గొర్రెపిల్లను బహూకరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, పార్టీ మం డలాధ్యక్షుడు విజయ్‌కుమార్, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ నజిమున్నీసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అ ధ్యక్షుడు చెన్నయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు సుజాత, సంగీత, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ దౌలన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంజనేయులు, నాయకులు నాగిరెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, అబ్రహం, సర్వారెడ్డి, పురుషోత్తంరెడ్డి, భరత్, సంజీవ్, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.