నారాయణపేట రూరల్, ఏప్రిల్ 7 : మండలంలోని ల క్ష్మీపూర్లో రూ.26.48 లక్షలతో చేపట్టనున్న ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం పనులకు గురువారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అదనపు కలెక్టర్ పద్మాజారాణితో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్ రాష్ట్రంలోని బడులు బాగు చేయాలనే ఉద్దేశం తో రూ.7,380 కోట్లతో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమానికి నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు.
లక్ష్మీపూర్‌లో రూ.26.48 లక్షలతో పాఠశాల అభివృద్ధి పనులు చేపట్ట నున్నట్లు తెలిపారు. రూ.8 లక్షలతో కంపౌండ్‌వాల్ ని ర్మాణం, రూ.3 లక్షలతో మరుగుదొడ్లు, రూ.3.40 లక్షలతో కిచెన్ షెడ్, రూ.3 లక్షల 5 వేలతో బెంచీలు, రూ.3 లక్షల తో పెయింటింగ్, రూ.40 వేలతో గ్రీన్ బోర్డులతోపాటు క రెంట్ తదితర పనులు చేపట్టనున్నారన్నారు. జిల్లాలో మొ దటగా ఈ గ్రామంలో పనులను ప్రారంభించామన్నారు. ప్రతిఒక్కరూ బడులను గుడులుగా భావించాలన్నారు. వ చ్చే సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన ప్రా రంభిస్తున్నందున తమ పిల్లలను పాఠశాల ల్లో చేర్పించాలన్నారు. గతంలో 26 మంది విద్యార్థులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 99 మందికి పెంచడంపై హెచ్.ఎం జనార్దన్‌రెడ్డి ని అభినందించారు. అనదపు కలెక్టర్ మా ట్లాడుతూ కార్యక్రమంతో దీనస్థితిలో ఉన్న పాఠశాలలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో డీఈవో లి యాఖత్ అలీ, ఎంఈవో గోపాల్‌నాయక్, తాసిల్దార్ దానయ్య, ఎంపీడీవో సందీప్‌కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాము లు, ప్రధానకార్యదర్శి రవీందర్‌గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, స ర్పంచ్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, ఏప్రిల్ 7 : పేటకు త్వరలో జిల్లా కోర్టు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి తెలిపా రు. పేటకు మంజూరైన అడిషనల్ కోర్టును ఈనెల 9న ప్రా రంభించనున్న సందర్భంగా గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డిని బార్ అసోసియేష న్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమానికి హా జరు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కోర్టుకు సంబంధించిన లేఖను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఇవ్వడం జరిగిందని, జిల్లా కోర్టుకు అవసరమైన భవనం కూడా ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. వీలైనంత త్వరలో జిల్లా కోర్టు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేష న్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, న్యాయవాదులు నారాయ ణ, భీంరెడ్డి, వారధి నవీన్‌కుమార్, రెడ్‌క్రాస్ కార్యదర్శి సు దర్శన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, కోయిల్‌కొండ సర్పంచ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.