మహబూబ్ నగర్ కలెక్టరేట్: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్( Additional Collector ) మోహన్ రావు ( Mohan Rao) అన్నారు. శుక్రవారం అడ్డాకుల మండలం రాచర్ల ఇసుక డంప్ ప్రాంతాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు, గనుల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఇసుక లభ్యత గురించి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచి తహసీల్దార్‌కు సమాచారం అందించి వాహనం ద్వారా లబ్ధిదారునికి సరఫరా చేయాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట గనుల శాఖ సహాయ సంచాలకులు జి సంజయ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
పూలేకు ఘన నివాళి
మహాత్మా జ్యోతి బా ఫూలే ( Jyothiba Phule ) జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు ఫూలేచిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, సీఎంవో బాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.