నారాయణపేట, జూలై 30 : ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరింది. అయినా నారాయణపేట జిల్లాలోని పలుచోట్ల క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ఆశించిన వేగంతో సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముగియడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్న ది. ఈ క్రమంలో అనేక పోలింగ్ కేంద్రాల పరిధి లో 100 శాతం ఆన్లైన్ లక్ష్యం ఇంకా పూర్తికాలేదన్న విషయం బుధవారం వరకు జిల్లాలో నమోదైన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించడం, కొత్త ఓటర్ల నమోదుతో పాటు చిరునామా మార్పులు, పేరు సవరణలు వంటి ప్రక్రియలను పూర్తి చేయాల్సిన బాధ్యత బూత్ లెవల్ అధికారులపై ఉన్నది. అయితే సిబ్బంది కొరత, విస్తారమైన పరిధి, ప్రజలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో పలువురు బీఎల్వోలు ఇప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు దరఖాస్తు ఫారాలు అందకపోవడం, మరికొన్ని చోట్ల ధ్రువీకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొన్నది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మిగిలిన పనులను వేగవంతం చేయాలని ఎన్నికల అధికారులు బీఎల్వోలకు ఆదేశాలు జా రీ చేసినట్లు సమాచారం. ఎన్నికల సంఘం తా జాగా తెలంగాణలో సర్ షెడ్యూల్ గడువును ఈనె ల 24 నుంచి సవరించి, ఆగస్టు 3వ తేదీ వరకు బీఎల్వోల ఇంటింటి ధ్రువీకరణకు అదనపు సమయం కల్పించింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో లక్ష్య సాధనపై ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.
గడువు ముగిసేలోపు ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ముఖ్యంగా ఆన్లైన్ నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతోంది. 100 శాతం లక్ష్యం చేరుకోవాలనే ఉద్దేశంతోపాటు వీలైనంత త్వరగా ప్రక్రియ చేపట్టాలని అధికారుల నుంచి ఒ త్తిడి ఉండడం తో తొందరలో పొరపాట్లు చోటు చేసుకోకుండా చూడాల ని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నారాయణపేట నియోజకవర్గంలో 2,42,773 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 2,2,440 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. మరో 31,624 మంది ఫారాలను ఆన్లైన్ చేయా ల్సి ఉన్నది. ఇంకా నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండడం.. ఇది వరకు ఉన్న ఫారాలను ఆన్లైన్ చేయడంతోపాటు 8,778 మంది ఓటర్ల ఫారాలను పరిశీలించాల్సి ఉన్నది. ఆగస్టు 3 నాటికి ప్రక్రియ పూర్తయ్యేనా అన్న పరిస్థితి నెలకొన్నది. అలాగే మక్తల్లో 2,52,801 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 2,11,268 డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. మరో 41,533 మంది ఫారాలను ఆన్లైన్ చే యాల్సి ఉన్నది. కేవలం ఇంకా నాలు గు రోజుల గడువు ఉండడం.. ఇది వరకు ఉన్న ఫారాలను ఆన్లైన్ చేయడంతోపాటు 3,384 ఫారాలను పరిశీలించాల్సి ఉన్నది.