దేవరకద్ర, అక్టోబర్ 6 : నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని బీడు భూములను సాగులోకి తీసుకోరావడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్ద గోప్లాపూర్ గ్రామ సమీపంలో వాగు లో రూ.10కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సమీపంలో వాగులు ఉన్న గత పాలకులు పట్టించుకోక పోవడంతో మండలంలో ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా బీడుభూములు కనిపించేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అశీర్వాదంతో నియోజకవర్గంలోని వాగుల సమీపం లో చెక్‌డ్యాంలు నిర్మాణం చేయడంతో చెక్‌డ్యాం కు అటుఇటు కిలోమీటర్ల మేరకు నీరు నిల్ల ఉండడంతో గ్రామాల్లో బోరుబావుల్లో పుష్కలంగా రిచార్జీ అవుతుందన్నారు. దీంతో గ్రామాల్లో సాగు అధికంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రై తులకు సంక్షేమపథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అనంతరం గోప్లాపూర్, బస్వాపూర్, వెంకటాయపల్లి తదితర గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయ్యం
గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదోడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాయపల్లిలో 65 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.3.27కోట్ల నిధులు మంజూరు కావడంతో భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి 65 ఇండ్లు మంజూరు చేసిందన్నారు. గృహలక్ష్మి పథ కం కింద 20 మందిని ఎంపిక చేశామని తెలిపా రు. త్వరలో జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలో ఎ స్సీ, యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా గ్రామీణ క్రీ డాకారులకు సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను వెంకటాయపల్లి, గద్దెగూడెం గ్రామానికి చెందిన యువకులకు అందజేశారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ ప్రాంతంలోని రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆ ల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాయపల్లిలో జిల్లా పశుగణాభివృ ద్ధి సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలోని రైతుల పశువులకు ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ఆ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పశువులు ఎదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సంబంధిత పశువైద్య సిబ్బంది సలహాలు తీసుకోవాలన్నారు. అనంతరం రైతులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సహకార సం ఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సు జాత, మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకు లు శ్రీకాంత్‌యాదవ్, యుగేందర్‌రెడ్డి, కొండారెడ్డి, బాలరాజు, రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, తాసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీనివాసులు, మండల పశువైద్యాధికారి జీసన్‌అలీ, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
చిన్న చింతకుంట, కౌకుంట్ల మండలాల్లో
తెలంగాణలో అభివృద్ధికి మారుపేరు అంటే కేసీఆర్ సర్కార్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పే ర్కొన్నారు. శుక్రవారం చిన్నచింతకుంట, కౌకుం ట్ల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా కౌ కుంట్ల మండలం ముచ్చింతల గ్రామం నుంచి కౌ కుంట్ల రైల్వేస్టేషన్ రోడ్డు వరకు రూ.3కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రా రంభించారు. దాసర్పల్లి నుంచి వెంకటగిరి వర కు రూ.3కోట్లతో బీటీ రోడ్డు పనులను, తిర్మలాపూర్‌లోని ఊకచెట్టు వాగు వద్ద రూ.20.96 కోట్ల తో, చింతకుంట మండలం నెల్లికొండి గ్రామ శివారులో రూ.15.29కోట్లతో, వడ్డెమాన్ గ్రామ శివారులో రూ.12కోట్లతో చెక్‌డ్యాంలకు భూమిపూజ లు చేసి పనులను ప్రారంభించారు. అలాగే వడ్డెమాన్‌లో రూ.20లక్షలతో నూతన పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. రాజోలిలో రూ. 20లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పుట్టపల్లిలో ‘మన ఊరు-మనబడి’ ద్వారా మంజూరైన అదనపు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీలు అన్నపూర్ణ, రాజేశ్వరీ, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచులు హరిత, కృష్ణవేణి, ఎంపీటీసీ కిష్టన్న, మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, కోట రాము పాల్గొన్నారు.