మక్తల్, ఆగస్టు 8 : మక్తల్ నియోజకవర్గంలోని ఊటూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షమీ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి, పార్టీలో చురుకైన కార్యకర్తగా విధులు నిర్వహించినటువంటి షమీ, రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ ఎన్నికల్లో చేరి, అకడ సరైన గుర్తింపు ఉండకపోవడంతోపాటు, అసలు కార్యకర్తగా గుర్తించలేక పోవడానికి జీవించుకోలేని షమీ, తిరిగి బీఆర్ఎస్లో చేరారన్నారు. రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, ఏ ఒక కార్యకర్త అధైర్యపడకుండా, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గవినోల నరసింహారెడ్డి, సోషల్ మీడియా మక్తల్ నియోజకవర్గ నాయకుడు తరుణ్రెడ్డి తదితరులు ఉన్నారు.