సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మౌనం రాజ్యమేలుతోంది. ఎవరేం మాట్లాడినా..? ఎవరిపైకి ఏం వస్తుందో..? అది ఏ కుటుంబాన్ని బలితీసుకుంటుందోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతున్నది. అధికారం అర్రులుచాచి పడగ విప్పుకొని బుసలు కొడుతుంటే.. విషాగ్ని ఎందరి ప్రాణాలను ఆహుతి చేస్తుందోనన్న భయంతో గ్రామస్తుల గొంతులు మూగబోయాయి.
13 ఏండ్లపాటు గ్రామానికి సర్పంచ్‌గా సేవలందించి అధికార బలాన్ని ఎదురించడానికి తన బలం సరిపోక, అవమానాలను, అరాచాకాలను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పాంకుంట్ల సాయిరెడ్డి కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లాలనుకున్న గ్రామస్తులను అధికార బలం భయపెడుతున్నది. సాయిరెడ్డిని కడసారి చూపుచూసుకొని నాలుగు కన్నీటి చుక్కలు రాల్చేందుకు కూడా అడుగు ముందుకు పడని దుస్థితి గ్రామస్తులది.
– మహబూబ్‌నగర్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుల అగడాలు భరించలేకపోతున్నానని మరణవాంగ్మూలం రాసుకొని ప్రాణాలు తీసుకున్న సాయిరెడ్డి పార్థివదేహం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలోని మార్చురీలో ఉం ది. పెద్ద కొడుకు వెంకట్‌రెడ్డి బిడ్డల వద్దకు అమెరికా వెళ్లిన నేపథ్యంలో ఆయన కోసం మిగతా కుటుంబ సభ్యులు ఎదరు చూస్తున్నారు.
ఆదివారం రాత్రి వెంకట్‌రెడ్డి హైదాబాద్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఆయన వచ్చే వరకు భౌతికకాయం మార్చురీలోనే ఉండనున్నది. సాయిరెడ్డి సంతానం, బంధువుల తప్పా.. అయ్యో అని సానుభూతి వ్యక్తం చేసే గ్రామస్తులే కరువయ్యారు. సాయిరెడ్డి మృతి గురించి ఎవరు.. ఎక్కడ మాట్లాడొద్దనే రీతిలో అధికారం బెదిరింపులు జారీ చేయడంతో.. ఎవరిని మందలిస్తే ఏం చేటు వస్తుందనే భయంతో కళ్లతోనే మాట్లాడుకునే నిర్బంధాన్ని సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామస్తులు చవిసూస్తున్నారు.
అత్యంత దురదృష్టం ఏమిటంటే.. మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త కొండారెడ్డిపల్లి గ్రామస్తులు చాలామందికి రా త్రి 10 గంటల వరకు తెలియని పరిస్థితి. సాయంత్రం 6 గంట ల వరకే ప్రపంచానికి తెలిసిన మరణ వార్త స్థానికులకు తెలియలేదు. గ్రామానికి చెందిన ఒకరు రాత్రి 8 గంటలకు తన వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వచ్చాడు.
ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్న అతని కొడుకు సాయిరెడ్డి ఆత్మహత్య గురించి చెప్పేవరకు తెలియలేదు. అంటే.. సాయిరెడ్డి గురించి మాట్లాడానికి గ్రామంలో అధికారం నిర్బంధం విధించింది. గ్రా మంలోని వాట్సాప్ గ్రూపుల్లో సాయిరెడ్డి ఎలాంటి మాటముచ్చట కూడా రావొద్దని అధికారం హెచ్చరించడంలో వాట్సాప్ గ్రూపులు మూగబోయాయి. చివరకు కుటుంబ సభ్యులు కూడా జరిగిన దారుణాన్ని చెప్పుకుని తనివితీరా ఏడవడానికి కూడా అధికారం భయపెడుతుంది.
అయ్యో దారుణం జరిగింది. నియంతృత్వం, రాక్షసపాలనను ఎవరన్న ప్రశ్నిస్తారన్న అనుమానంతో వారి గొంతులను పురిట్లోనే పిసికిపారేయాలని అధికారం ఇచ్చిన ఆదేశాలతో కల్వకుర్తికి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు దవాఖానలో ఎవరేం మాట్లాడుకుంటున్నారని నిఘా ఉంచారు. దవాఖానలో ఏం జరుగుతుంది.. గ్రామస్తులు ఏం మాట్లాడుకుటున్నారు..? అధికారం అనుచరుల చేత గమనిస్తుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే అధికారం చెప్పుచేతల్లోనే దవాఖానలో వ్యవహారం అంతా సాగుతుంది.
కొండారెడ్డిపల్లికి భయం ఈ మధ్యన వచ్చిందికాదు. అధికారం గద్దెనెక్కిన నాటి నుంచి అధికార వాససత్వం గ్రామస్తులకు భయాన్ని కొంచెం, కొంచెం పరిచయం చేస్తూ వచ్చింది. భూ వ్యవహారాల్లో తలదూర్చి అధికార బెదిరింపులు, దాడులకు గురైన గురువారెడ్డి ఆత్మహత్య నాటికి గ్రామస్తులకు భయం పూర్తిసాయిలో పరిచయమైంది. కొండారెడ్డిపల్లికి నాలుగులేన్ల రోడ్డు విస్తరణలో చాలామంది రైతుల భూములు, భూమిలోపల ఉన్న పైప్లైన్లు, బోరుబావులు నలిగిపోయినా రైతులను భయంతో కిర్రుమనలేదు. గ్రామం మధ్యలో భూములపై కన్నేసిన కిక్కురుమనలేదు.
అధికారం చెప్పిందే వేదం అం టూ జీ హుజూర్ అనే దుస్థితి. కాదంటే పోలీసు కేసులు పరిచయమవుతాయి. జైళ్లో ఊచలు లెక్కించాల్సి వస్తుంది. అధికారానికి చెందిన పోరంబోకోళ్ల చేతుల్లో చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇంత భయంలో బతుకుతున్న గ్రామస్తుల్లో సాయిరెడ్డి ఆత్మహత్య మరింత భయాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో కొండారెడ్డిపల్లికి అచ్చంపేటకు చెందిన పెద్ద పోలీస్ సారు నేతృత్వంలో భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఒకవైపు అధికారం, మరోవైపు పోలీసులు ప హారా కాస్తుంటే ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా..? అని స్థానికులు గడియలను లెక్కబెడుతున్నారు.
సాయిరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది గ్రామంలో చిన్న పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు తెలుసు. జరిగిన తతంగమంతా అందరికీ ఎ రుకే. అయినా ఎవరి నోట్లో నుంచి మాటా పెగలదు. 25 ఏండ్ల కిందట వచ్చిన అసెంబ్లీరౌడీ అనే సినిమా కొండారెడ్డిపల్లి దుస్థితికి అతికినట్లు సరిపోతుంది. అందరికీ నిజం తెలుసు. నిజం మాట్లాడితే.. మ రణం వెంటాడుతుంది. గురువారెడ్డి ఆత్మహత్య గురించి సాయిరెడ్డి మాట్లాడితే.. సాయిరెడ్డి కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల ను నేటి ప్రభుత్వం తీసుకొస్తున్నది. అం దుకే ఎవరూ ప్రశ్నించరు. ప్రశ్నిస్తే గురువారెడ్డి, సాయిరెడ్డిలా విగతాజీవులుగా మారాల్సిందే.