అలంపూర్, జనవరి 12 : నాగర్‌కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం గత కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతూ ఆదివారం రాత్రి నిమ్స్ దవాఖానలో మృతి చెందారు. మంద జగన్నాథం జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, ప్రస్తుత ఎర్రవల్లి మండలం కొండే రు గ్రామంలో పెద్దపుల్లయ్య- మంద సవారమ్మ దంపతులకు 1951 మే 22వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి నాగార్జునసాగర్‌లోని పైలాన్ కాలనీలో మెకానికల్ విభాగంలో వాచ్‌మెన్‌గా పని చేశారు. తల్లి సవారమ్మ హిల్‌కాలనీలో ఆఫీస్ అటెండెంట్‌గా పనిచేసింది. వృత్తిరీత్యా ఆయన మొదట్లో వైద్య వృత్తిలో కొనసాగారు. మొదట తెలుగుదేశం పార్టీలో చేరి నాగర్‌కర్నూల్ ఎంపీగా విజయం సాధించారు.
పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2014 మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగు జాడ ల్లో నడిచాడు. ప్రత్యేక తెలంగాణ సాధించడంలో పార్లమెంట్లో పదివిని సైతం త్యా గం చేసి కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ప్రత్యేక అధికారిగా కెబినెట్ హోదాలో రెండుమార్లు అవకాశం కల్పించారు. మంద జగన్నాథం అకాల మరణం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అందులోని అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే మంద జగన్నాథం భౌతికకాయాన్ని నిమ్స్ దవాఖాన నుంచి హైదరాబాద్‌లోని చెంపాపేట్కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు సంతోష్‌నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.