దేవరకద్ర : డాక్టరేట్ అవార్డు పొందిన స్వచ్ఛంద సేవకుడు, దేవరకద్ర మాజీ ఎంపీటీసీ ఉస్కిల్ల వెంకట్రాములును దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వెంకట్రాములు గత కొంత కాలంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో ముందుంటున్నారు. మానవత్వ హృదయంతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
యువతకు క్రీడలలో రాణించడానికి తనవంతుగా ఆర్థిక సాయం చేస్తూ, ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అతడి సేవలను గుర్తించి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ సిటీలో గల హెచ్ఏడీపీ రిసోర్సు సెంటర్ ఫర్ ట్రైబల్ కల్చర్ హాల్లో వెంకట్రాములుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దుబ్బలి ఆంజనేయులు, నాయకులు యుగంధర్ రెడ్డి. నవీన్ గౌడ్ ఎండీ ఖాజా తదితరులు ఉన్నారు.