మరికల్, జూలై 24 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, రిజర్వేషన్ ఏది వచ్చినా ప్రతి పల్లెలో గులాబీ జెండా ఎగరాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజేందర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ మండలాధ్యక్షుడు లంబడి తిరుపతయ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించి పార్టీలకు అతీతంగా అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాం అంతా దోచుకో.. దాచుకో అన్న రీతిలో పాలన నడుతుస్తుందని ఎద్దేవా చేశారు.
పోలీసులు అత్యుత్సాహంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తు ఉరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పోలీసులు పని చేస్తూన్నరా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఠా తగదాలకు దూరంగా ఉండి కలిసి కట్టుగా పనిచేసి ప్రతి పల్లెలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఎలా ఉన్నారని, 18 నెలల పాలనకే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడితే ఎలా అన్నారు. గతంలో మరికల్ మండలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలనాన్నరు. మరికల్ మండలం ఏర్పాటుతోపాటు ఇంటిగ్రెడేడ్ మండల కాంప్లెక్స్ నిర్మాణం, కేజీబీవీ, వ్యవసాయ గోదాం నిర్మాణం, ప్రతి పల్లెకు బీటీ రోడ్లు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్దే అని గుర్తు చేశారు. కానీ 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గ్రామానికి బీటీ రోడ్డు రాలేదని, ఒక్క గల్లిలో కూడా సీసీ రోడ్డు వేయాలని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలముందు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని ఎస్‌ఆర్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలకు మూడు ఇండ్లు మంజూరైతే 30 ఇండ్లకు ముగ్గులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఏమయ్యాయని, పింఛన్ డబుల్ చేస్తామని చెప్పిన మాట ఏమైందని, రైతులకు మూడు విడుతల రైతు భరోసా డబ్బులు ఎక్కడికిపోయాయని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా ఇస్తున్నారని, దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించడం ఖాయం అన్నారు. పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పార్టీ గెలుపుకోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నా యకులు రాజవర్ధన్‌రెడ్డి, హన్మిరెడ్డి, రవికుమార్, లక్ష్మయ్య, సంపత్‌కుమార్, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, బసంత్, రాజరేందర్గౌడ్, రామస్వామి, శేఖర్, కస్పే గోవర్ధన్, మతీన్, జగదీశ్, కొండారెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలతోపాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.