ధన్వాడ, నవంబర్ 1 : కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఓటరును అభ్యర్థించారు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక సందర్భంగా శనివారం రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రహెమత్ నగర్, హెచ్ఎఫ్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ మెంబర్ వహీద్, గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ ధన్వాడ మండల యువజన అధ్యక్షుడు సునిల్‌రెడ్డి, ఇర్ఫాన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.