బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి
బండి సంజయ్ తన కుమారు డు బాలికపై చేసిన లైంగిక దాడికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కు మారుడు సాయి భగీరథ్ ప్రవర్తనపై గతంలో అనేక ఘటనలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయన్నారు.
- మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి
నారాయణపేట, మే 11 : బండి సంజయ్ తన కుమారు డు బాలికపై చేసిన లైంగిక దాడికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ కు మారుడు సాయి భగీరథ్ ప్రవర్తనపై గతంలో అనేక ఘటనలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయన్నారు. మైన ర్ బాలికను లొంగదీసుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అన్ని వర్గాల నుంచి ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయకుండా చేశారన్నారు. ప్రధాన మంత్రి కార్యక్రమం లో ఆత్మహ్యత్య చేసుకుంటానని తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక నామమాత్రంగా కేసు నమోదు చేశారే గానీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదన్నారు.
బండి సంజయ్ ప్రధాన అ నుచరుడు సంగప్ప సైతం బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పోక్సో కేసు నమోదైన 24గంటల్లో అరెస్ట్ చేయాలని సెక్షన్ చెబుతున్నప్పటికీ ఎందుకు ఇంత వరకు అరెస్ట్ చేయడం లేదన్నా రు. దేశం దాటి వెళ్లకుండా భగీరథ్‌కు లుక్ అవుట్ నోటీ సు ఇవ్వాలన్నారు. చెడ్డ పనులు చేస్తూ కులం పేరు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం బండి సంజయ్ మానుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ఏదైనా జరిగితే అందుకు పూర్తి నైతిక బాధ్యత సీఎంరేవంత్ రెడ్డి, కేంద్రం మంత్రి బండి సంజయ్లదేనన్నారు. సమావేశంలో పట్ట ణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, కౌన్సిలర్ భరత్, రాజు, చాంద్, శరత్, శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

