కోస్గి, సెప్టెంబర్ 14 : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై రౌడీలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ చేయడం అప్రజాస్వామికమని, దీన్ని అందరూ ఖండించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ బీ-ఫాంపై గెలవాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ అక్రమ అరెస్టులకు ఎ వరూ భయపడరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్టు 15వ తే దీన రాష్ట్రంలో రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.46వేల కోట్లలో కేవలం రూ.17వేల కో ట్లతో 30శాతం మంది రైతులకు రుణమాఫీ చేశారని ఎ ద్దేవా చేశారు. కొడంగల్‌లో కూడా 30శాతం మాత్రమే రు ణమాఫీ జరిగిందన్నారు. రైతులకు ఇప్పటి వరకు రైతు భ రోసా అందించలేదన్నారు. కోస్గి పట్టణంలో గతంలో రూ.8కోట్లతో సయ్యద్ పహాడ్ నుంచి ఏబీకే ఫంక్షన్ హాల్ వరకు డబుల్ లేన్ రోడ్డును కొంత పూర్తి చేశాయగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇంకా పూర్తి చేయలేదన్నారు.
గ తంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.70కోట్లు మంజూరు చేయిస్తే వాటికి ఇప్పుడు కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారన్నారు. రైతు భరోసాను పక్కదారి పట్టించడాని కి హైడ్రా డ్రామాను తీసుకొచ్చారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వ చేతగాని తనాన్ని ఎండగడుతారన్నారు.
నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకొని తీరుతామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హె చ్చరించారు. ఏడు గ్రామాల పరిధిలో వేల ఎకరాల్లో ఫా ర్మాసిటీని నిర్మిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌ను సూ టి ప్రశ్న అడుగుతున్నా.. గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలో 13 వేల ఎకరాలను కేటాయించిందని గుర్తు చేశారు. సిద్ధంగా ఉన్న స్థలంలో ఫార్మా ఏర్పాటు చేయకుండా కొ డంగల్‌కు ఎందుకిచ్చారో చెప్పాలని నిలదీశారు.
ఇప్పటికే స్థానిక రైతులు ఈ కంపెనీ రాకను వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలన్నారు. కోస్గి పట్టణం సమీపంలో పొల్యూషన్ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు ముందు కోస్గి పట్టణంలో ఉన్న బీసీ కాలనీ, శాసం కాలనీ, బహర్పేట్, బ్రాహ్మణ్ విధీలో ఏర్పాటు చేసిన గణనాథులకు పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయక లు శాసం రామకృష్ణ, వెంకట్ నర్సింహులు, కోట్ల మైపా ల్, విష్ణువర్ధన్‌రెడ్డి, మాధుయాదవ్, సాయిరెడ్డి, బెజ్జు న ర్సింహులు , సురేశ్ తదితరులు పాల్గొన్నారు.