బీఆర్ఎస్ బలోపేతంపై దృష్టి
కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 11వవార్డు భీంపూర్లో ఆదివారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
- భీంపూర్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
- కేడర్లో నూతన జోష్
మద్దూర్, మార్చి 22 : కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 11వవార్డు భీంపూర్లో ఆదివారం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉ మ్మడి మద్దూర్ నాయకులు, కార్యకర్తలు ఉ త్సాహభరితంగా పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.
కాంగ్రెస్ బడ్జెట్ బోగస్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెద్ద బోగస్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్తో రాష్ట్రం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను బడ్జెట్లో ప్రతిబింభించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2500 సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద బంగారం వంటి కీలక హామీలు ఎక్కడా కనిపించకపోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
అనంతరం మండలంలోని అప్పిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అంబటి వెంకటయ్య తండ్రి భీమ ప్ప ఉగాది పండుగ రోజు మృతి చెందిన విషయం తెలుసుకున్న పట్నం నరేందర్రెడ్డి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మండలంలోని చెన్నారెడ్డి పల్లె గ్రామానికి చెందిన హనుమంతు, అనిత దంపతులు రెండో కుమార్తె చిన్నారి ప్రసన్న ఐదేండ్లుగా తలసేమియా వ్యాధితో బాధపడుతుండగా చిన్నారిని పరామర్శించి ఆపరేషన్ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, కౌన్సిలర్లు, ఎంఎన్ నర్సింహులు, మౌలానా, నింగ్యానాయక్, మ్యాతరి మహేందర్, సాయిలు, అంజయ్య , బసిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

