నాగర్‌కర్నూల్, జూన్ 3 : తెలంగాణ పదేండ్ల పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు మువ్వన్నెల జెండా, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్రి తెలంగాణ రాకముందు, వచ్చిన పదేండ్ల కాలంలో కేసీఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 60 ఏండ్లుగా తొలిదశ ఉద్యమం నుంచి సాధించలేని ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్నామన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 2014న టీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు ప్రత్యేక నిధులు రావడం తో మంచిగా అభివృద్ధి చేసుకున్నామన్నారు.
దేశంలోని 29 రాష్ర్టాల్లో రైతులకు 24గంటల విద్యుత్ అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. ము ఖ్యంగా రైతులకు ప్రోత్సాహకాలు అందించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యిందని, ఇప్పటికే ప్రజలకు తెలంగాణ రాకముందు జరిగిన పరిణామాలు ఎదురవుతున్నాయన్నారు. కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని, వరి పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. ఏదేమైనా ప్రజలకు అన్యాయం జరిగితే వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి ఉద్యమిస్తుందని వివరించారు. అంతకుముందు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్, జెడ్పీటీసీ శ్రీశైలం, నందకిశోర్రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.