బిజినేపల్లి, జూలై 15 : ప్రస్తుతం తెలంగాణలో నిర్వహిస్తు న్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి ఓటరును బీఎల్ఏలు నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, పార్టీ ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ ఫంక్షన్హాల్లో బిజినేపల్లి మండల బీఆర్ఎస్, బీఎల్ఏల సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రతి గ్రామంలో బీఎల్ఏలు ముందుం డి ఓటర్ల ఫారాలు నింపి బీఎల్వోలతో డిజిటల్ చేయించాలన్నారు. సర్ కార్యక్రమంలో ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు లు వంటి అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. మళ్లీ ఏడు రోజుల తర్వాత సమీక్ష నిర్వహిస్తామని, అప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలన్నీ డిజిటలైజేషన్ పూర్తి కావాలన్నారు. కార్యక్రమంలో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.