చారకొండ, జూలై 9 : రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే రైతులు సుభిక్షింగా ఉన్నారని, ప్రజా ప్రభు త్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని జూపల్లి శివారులో ఎంజీకేఎల్ఐ డీ-82 కాల్వను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.35 వేల కోట్లు నిధులు కేటాయించి, రూ.27,500 కోట్లతో ప్రాజెక్టులను పూర్తిశారని గుర్తు చేశారు.
ఈ ప్రాంత ముద్దుబిడ్డ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్న కనీసం ఒక్కప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికంగా రైతులు, ప్రజలు వ లసలు వెళ్తున్నారని గుర్తించిన కేసీఆర్ పాలమూ రు జిల్లాను సస్యశామ లం చే సేందు కు ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి చేసి సాగునీరు అందించారని చెప్పారు. వరదలు వచ్చి ప్రాజెక్టులు, కాల్వలు నిండిపోతున్న రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వానికి సాగునీరు అందించాలని, లేని పక్షంలో లక్ష మందితో కలిసి కృష్ణానదిపై ఉన్న గేట్లను ఓపెన్ చేస్తామని సవాల్ విసరడంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో అరకొరగా రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారని, రూ.రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమ కోసం అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారని, నేడు రేవంత్‌రెడ్డి పాలనతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్ధానాలు అమలు చేయడంలో కాలయాపన చేస్తూ, పరిపాలన చేతకాక బీఆర్ఎస్పై కుట్రలు, కుతంత్రాలు చేస్తుందన్నారు.
ప్రజా, రైతు వ్యతిరేక ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యుర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం జూపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన మైసమ్మ, వీరయ్య కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, మాజీ ఉపసర్పంచ్ జగపతి, నాయకులు తిరుపతయ్యాచారి, శ్రీరాములు, పెద్దయ్యయాదవ్, శేఖర్‌గౌడ్, భిక్షపతియాదవ్, వెంకటయ్యగౌడ్, రామస్వామి, గంగరాజు, రియాజ్, బిక్కన్, ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.