కల్వకుర్తి, ఫిబ్రవరి 13 : ఐదు విడుతలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటూ గురువారం పాడిరైతులు ఆందోళనకు దిగారు. కడ్తాల మండలకేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై పాలను వలుకబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి రైతులకు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పాడి రైతులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలుపోస్తున్నాయని, పాల బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇప్పటికి ఐదు బిల్లులు సంస్థ బకాయి పడిందని వాపోయారు. ప్రతి 15రోజులకు ఒకసారి చెల్లించాల్సిన పాల బిల్లులు క్రమ పద్ధతిన చెల్లించకపోవడంతో పాడిరైతుల జీవితాలు ఇబ్బందుల్లో పడిపోయామని ఆవేదన వ్యక్తం చేశా రు.
రెండున్నర నెలల బిల్లులు( 5 బిల్లులు) బకాయి ఉండడంతో దినసరి ఖర్చు లు, భోజనం, పిల్లల ఫీజులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం పాడి పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నామని, పాలబిల్లులు రాకపోవడంతో భిక్షమెత్తుకోవాల్సిన దుస్థితి దాపురించిందని వాపోయారు. పాలబిల్లుల కోసం కడుపుమండి ధర్నాలు చేస్తున్నా.. ప్రభుత్వం కనీ సం పట్టించకోవడం లేదని మండిపడ్డారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, రైతుల ను వేధించే ప్రభుత్వమని రైతులు దుయ్యబట్టారు. పాడిరైతుల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. కేవలం కడ్తాల పాలశీతలీకరణ కేంద్రం పరిధిలో రూ.17 కోట్ల పెండింగ్‌లో ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, పోసిన పా లకు కూడా బిల్లులు ఇవ్వని దుస్థితిలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజీమానా చేయాలని పాడిరైతులు డిమాండ్ చేశారు.
చేతకాని దద్దమ్మ ప్రభుత్వం : జైపాల్
చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ర్టాన్ని పాలిస్తుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. దేశవ్యాప్తంగా ఇంతచేతకాన్ని ప్రభుత్వం మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదని ఆయన దుయ్యబట్టారు. పాడి రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాడిరైతుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. పాలను అమ్ముకుని జీవనం సాగిస్తున్న పాడి రైతులకు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. అసలు ప్రభుత్వానికి రైతుంటేనే ప్రేమలేదని మండిపడ్డారు. రుణమాఫీ సగంలోనే ఆపివేశారని, రైతు భరోసా ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో ఇంతకు ప్రభు త్వం ఉం దో లేదో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.
నిజం చెప్పాలంటే ఇదిఒక మాయ ప్రభుత్వం, మా టల గారడీ చేస్తూ ప్రజలను వంచనకు గురిచేస్తున్నారని జైపాల్‌యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం లో రైతులకు స్వర్ణయుగంలా గడిచిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నరకంలా తయారైందని దుయ్యబట్టారు. అంత కు ముందు ఆయన పాడి రైతులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్సీటీసీ ధశరథ్నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మహేశ్, అశోక్‌రెడ్డి, నాయకులు రామకృష్ణ, రంగయ్య, ఎలమందరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మోహన్రెడ్డ్డి, కృష్ణయ్య, సుధాకర్, శ్రీశైలంయాదవ్, జం గయ్య, రంగనాయక, రాజు, మల్లేశ్, కొండల్, లాలు,రవి, వెంకట్రాములు, ఆంజయ్య, రాములుతో పాటు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.