మక్తల్, నవంబర్ 22 : గత రెండు రోజుల నుంచి మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్‌కు గురై దవాఖాన పాలైన ఘటన అందరికీ విధితమే. గురువారం కూడా జిల్లా అధికారుల ముందే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తినకుండా పారబోయడంతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బియ్యం తెప్పించి వండించి వడ్డించడంపై కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయడమే కాకుండా అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
శుక్రవారం ఉదయం జిల్లా పౌరసరఫలశాఖ అధికారి దేవరాజు, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి ఉమాపతి, జిల్లా ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ నీలిమ, మాగనూర్ ఇన్చార్జి తాసీల్దార్ సురేశ్ పరిశీలనలో మాగనూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు మధ్యాహ్న భో జనాన్ని తయారు చేస్తున్న సందర్భంగా కాం గ్రెస్ నాయకుల హడావిడి చేశారు. విద్యార్థులకు పాఠశాల సమయం ప్రకారంగా 12:30 కు మధ్యాహ్న భోజనం పెట్టాల్సి ఉండగా, కాంగ్రెస్ నాయకుల హడావుడిగా తమ నాయకుడి మెప్పుకోసం ఎమ్మెల్యే దగ్గర్లో వస్తున్నాడు కొద్దిసేపు ఆగాలని విద్యార్థులను ఒంటిగంట వరకు తరగతి గదుల్లోనే కూర్చోబెట్టారు.
దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. అదనపు కలెక్టర్ పాఠశాలలో ఉన్నప్పటికీ విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టారా లేదా అని పరిశీలించకుండా మక్తల్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అసలే రెండు రోజుల నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజ నం విషయంలో గందరగోళానికి గురైన విద్యార్థులకు సమయానికి అన్నం పెట్టాల్సింది పో యి నాయకుడి మెప్పుకోసం విద్యార్థులను అ ర్ధాకలితో క్లాస్ రూంలోనే కూర్చోబెట్టడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.