మక్తల్, ఆగస్టు 24: ఈనెల 26న మక్తల్ ఎమ్మెల్యే స్వర్గీయ చిట్టి నర్సిరెడ్డి జయంతిని పురసరించుకొని విగ్రహావిషరణ కార్యక్రమాన్ని మక్తల్ పట్టణంలోని ట్యాంక్ బం డ్ వద్ద నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. శనివా రం సాయంత్రం ఆయన నివాసంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా జీ ఎమ్మెల్యే మాట్లాడారు.
మక్తల్ నియోజకవర్గం రైతాంగానికి సాగునీరు అందించాలన్న సంకల్పంతో అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి భీమా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు చేయడంతో పాటు భీమా ప్రాజెక్టు సాధించేంతవరకు పట్టుబట్టిన మహా వ్యక్తి చిట్టెం నర్సిరెడ్డి అని పేరొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాలమూరు ఎంపీ డీకే అరుణమ్మ హాజరవుతారన్నారు. విశిష్ట అతిథులుగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి హాజరుకానున్నారని పేరొన్నారు. నియోజకవర్గంలోని చిట్టెం అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు.