మక్తల్: రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) మరణించిన పద్మమ్మ కుటుంబాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే(Former MLA) చిట్టెం రామ్మోహన్ రెడ్డి(Chittem Rammohan reddy) ఆదివారం మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనగా ఆమె చనిపోయింది.
పద్మమ్మ మరణానికి కారకులైన లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై స్పీడును తగ్గించే విధంగా సంబంధిత అధికారులు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన పద్మమ్మ కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకొని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత హైవే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకమరని అన్నారు. హైవేపై స్పీడ్ నియంత్రణ సూచికలను ఏర్పాటుచేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు, మాజీ ఎంపీటీసీ ఆశ రెడ్డి, నాయకులు శంకర్, అశోక్, సాగర్ లతోపాటు తదితరులు ఉన్నారు.