వీపనగండ్ల, మే 9 : అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయగౌడ్తో కలిసి కల్వరాలలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. కారు గుర్తుకు ఓ టేసి ఆర్ఎస్ ప్రవీణ్‌ను గెలిపించాలని కోరారు. ప దేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరువొచ్చిందన్నారు.
అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే నెం బర్ వన్ స్థానంలో నిలిపిన ఘతన కేసీఆర్‌కే దక్కుతుందున్నారు. ప్రతి ఒక్కరూ ఎంపీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అబద్ధాల కాంగ్రెస్, విద్వేషాలు నింపే బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కొల్లాపూర్ కోటపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనన్నారు. ఆర్ఎస్పీని గెలిపించుకొని నాగర్‌కర్నూల్ ప్రాంత అభివృద్ధిని సాధించుకుందామన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, నా యకులు రఘునాథ్‌రెడ్డి, సర్దార్ పాల్గొన్నారు.