సర్ సర్వేలో భాగస్వాములు కావాలి
సర్ సర్వేలో అన్ని గ్రామాల కార్యకర్తలు, యువత భాగస్వాములు కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో మండలంలోని గుడిబండ, రాచాల, పొన్నకల్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సర్ సర్వేపై మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మూసాపేట, జూన్ 26 : సర్ సర్వేలో అన్ని గ్రామాల కార్యకర్తలు, యువత భాగస్వాములు కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో మండలంలోని గుడిబండ, రాచాల, పొన్నకల్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సర్ సర్వేపై మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ గ్రామా ల్లో నిర్వహిస్తున్న సర్ సర్వేలో బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతి కుటుంబాన్ని కలవాలని, అధికారులతో సమన్వయంగా ఉంటూ ఎన్యుమరేషన్ ఫారం నింపే ప్రక్రియలో ప్రజలకు వివరాలు తెలియజేప్తూ సహకరించాలని సూచించారు. ఇప్పటి వరకు గ్రామా ల్లో ఇంటింటికీ వెళ్లి కుటుంబాల సంఖ్య మ్యాపింగ్ పూర్తి చేశారని, ఇప్పుడు డోర్ టూ డోర్‌కు వెళ్లి ఓటు నమోదు కార్యక్ర మం నిర్వహిస్తారని తెలిపారు.
అందుకని ప్రతి ఏజెంటు, కార్యకర్త అప్రమత్తంగా ఉండి మీ మీ వార్డుల్లో ఉండే వారి ఓటరు నమోదు ప్రక్రియలో ఓట్లు తొలగిపోకుండా నమోదు చేయించాలని సూచించారు. ఇం దులో బూత్ లెవల్ ఏజెంట్లు క్రియాశీలం గా పనిచేయాలని సూచించారు. అవసరమైతే ప్రతి ఓటరుతో ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు. సర్ నమోదులో ఎలాం టి జాగ్రతలు తీసుకోవాలో, అలాగే పార్టీ సభ్యత్వ నమోదుపై పలు సూచనలు చేశా రు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నకల్ సర్పంచ్ మహమూద్, సింగల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, మాజీ సర్పంచులు జయన్నగౌడ్, శ్రీకాంత్, ఖాజాగోరి, శ్రీనివాసులు, కృష్ణ య్య, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

