భూత్పూర్, డిసెంబర్ 17 : ప్రభుత్వం రైతులను ఒప్పించి పొలాలను తీసుకోవాలని, బలవంతంగా లాక్కోకూడదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల గిరిజన రైతుల కు న్యాయం చేయాలని కోరుతూ పార్టీ ఆధ్వర్యంలో భూత్పూర్లో నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆల మా ట్లాడుతూ ఎన్నికల్లో అమలుకాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అ మలు చేసిన రైతుబంధు, రుణమాఫీని ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. 45 శాతం మందికి రుణమాఫీ చేసి వంద శాతం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం భయపెట్టి పొలాలను తీసుకోవడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. కేసీఆర్ హయాంలో 123 జీవో ప్రకారం రైతులను ఒప్పించి పొలాలను తీసుకున్నారని గుర్తు చేశారు. లగచర్ల గిరిజన రైతులు తమకు బతుకుదెరువు లేకుంటదని పొ లాలివ్వమంటే.. ప్రభుత్వం కక్షసాధింపుతో అక్రమ కే సులను పెట్టి 40 రోజులుగా జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్ర యోగించడం సరికాదని హితవు పలికారు. లగచర్ల రై తులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చే స్తుందన్నారు.
కేసీఆర్ అప్పులు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి బద్నాం చేస్తున్నాడు.. తాము పదేండ్లల్లో చేసిం ది రూ.4 లక్షల కోట్ల అప్పు మాత్రమేనన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిష న్ కాకతీయ, కొత్త గ్రామ పంచాయతీ భవనాలు వం టి అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం అప్పులపై మాత్రమే మాట్లాడడం తగదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్లు బాలకో టి, రామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, స త్యనారాయణ, నాయకులు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రమౌళి, నారాయణగౌడ్, సత్యనారాయణ, న ర్సింహాగౌడ్, వెంకటయ్య, ఆంజనేయులు, శ్రీను, యాదయ్య, మురళీధర్‌గౌడ్, సాయిలు, అశోక్‌గౌడ్, రాములు, మందడి సరోజ్‌రెడ్డి, సురేశ్, యాదిరెడ్డి, ప్రే మ్, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు.