భూత్పూర్, డిసెంబర్ 2 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం సునాయసం అవుతుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో దేవరకద్ర నియోజకవర్గలంలోని నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా సమావేశాలను నిర్వహించారు. గ్రామాల్లో రిజర్వేషన్లకు అనుకూలంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాలను చేపట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల వైఫల్యాలను, రెండు పర్యాయాలు ఎగ్గొట్టిన రైతుబంధు, తులం బంగారం, పెన్షన్ల విషయాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గొప్పలు చెప్పి చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు.
కాంగ్రెస్ అంటేనే వంచనకు మోసానికి మరో పేరని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, నర్సింహాగౌడ్, మనెమోని సత్యనారాయణతోపాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
కొత్తకోట, డిసెంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తకోట బీఆర్ఎస్ కార్యాలయంలో పామాపు రం గ్రామ నాయకులతో సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, పామాపురం సింగిల్ విండో చైర్మన్ వాసుదేవారెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ వైస్ ఎం పీపీ గుంతా మల్లేశ్, మాజీ కోఆప్షన్ అల్లాబాషా, గాడిల ప్ర శాంత్, అయ్యన్న, మాధవ్, కేశవులు ఉన్నారు.