మూసాపేట/భూత్పూర్, నవంబర్ 7 : అబద్ధానికి నిలువెత్తు నిదర్శం గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనే అని, అద్దం లాంటి కేసీఆర్ పాలన చూసి ఓటు వేయాలి అని దేవరకద్ర ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను కోరారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్‌లోని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ప్రచా రం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు మేలు జరిగేవిధంగా పాలన చేసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని, కానీ ఇప్పుడున్న పాలనలో ప్రతివర్గం ఇబ్బందులు పడుతున్నారని, అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా ఎంతో వెనుకబాటుగుకు గురైనట్లు చెప్తూ కారు గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. ఆయన వెంట భూత్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, మాజీ ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ బాలకోటితోపాటు మూసాపేట మండల నాయకులు పాల్గొన్నారు.
అలంపూర్, నవంబర్ 7 : బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా శుక్రవాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో అలంపూర్ బీఆర్ఎస్ నాయకులు కిశోర్, రఘురెడ్డి, రవిప్రకాశ్, గోపాల్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, నవంబర్ 7 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 104లో హెచ్ఎఫ్ నగర్ ఫేస్ 2లోని మజీద్ ఎ ఖలీలుల్లాహ్ వద్ద ముస్లిం ఓటర్లను కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో ముస్లింల కోసం షాదీముబారక్ పథకం అమలు, షాదీఖానల ఏర్పాటు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం, మైనార్టీ పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.